భక్తజన సంద్రం మల్లన్న క్షేత్రం
09-03-2026 01:19 AM
తరలివచ్చిన భక్తులు
కొమురవెల్లి, మార్చి 8: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రా నికి రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఎనిమిదో వారం కూడా మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిం పు దశకు చేరుతున్నప్పటికీ, భక్తుల తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మల్లన్న సన్నిధానం చేరుకున్న భక్తులు స్వామివారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి, గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ ను దర్శించుకున్నారు. పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించి, ఒడి బియ్యం పోసి, తల్లిని భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.




