29 April, 2026 | 3:19 AM

మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

29-04-2026 01:02 AM

కలెక్టర్ మను చౌదరి 

మేడ్చల్, ఏప్రిల్ 28(విజయ క్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 నుండి ఉన్న  ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్  ప్రక్రియ పురోగతి పై డిసి,   ఎఆర్‌ఓ, ఈఆర్‌ఒలతో  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సమీక్షించారు.  మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్లు  ఫైజన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ హాజరైనారు.

ఈ సందర్భంగా మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  బిఎల్‌ఓలకు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లిస్టులు కాకుండా ఇంచుమించు సమానంగా ఉండేలా కేటాయించాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ పై తహాసీల్దారులు దృష్టి పెట్టి త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తి చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా పది ఇరవై శాతానికి తక్కువగా అయిన మ్యాపింగ్ ప్రక్రియ  శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినారు. తదుపరి సమావేశం వరకు మ్యాపింగ్  ప్రక్రియ పురోగతి కనిపించని ఎడల తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో తహాసీల్దార్లు, డిప్యూటి కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.