15 March, 2026 | 7:13 AM

సమాజ సేవలో మీడియాది కీలక పాత్ర

12-01-2026 01:02 AM

వేములవాడ, జనవరి11,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ విజయక్రాంతి జాతీయ దినపత్రిక నూతన ఆంగ్ల సంవత్సరం2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు సకాలంలో నిజమైన సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ముఖ్యంగా విజయక్రాంతి వంటి దినపత్రికలు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పాలకులకు తెలియజేయడంలో ముందుంటున్నాయని అభినందించారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత విశ్వసనీయతతో, ప్రజాపక్షంగా వార్తలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో శాంతి, భద్రత, అవగాహన పెంచడంలో మీడియాపోలీసుల సమన్వయం అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక వేములవాడ ఆర్సీ వొడ్యాల వేణు, జర్నలిస్టు దురిశేటి రాజు ఉన్నారు.