12-01-2026 01:04:53 AM
కోనరావుపేట, జనవరి 11(విజయక్రాంతి): ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆది శ్రీనివాస్, సేవాలాల్ మహారాజ్, జగదాంబ అమ్మవారిబగుడిలో పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం భూక్యా రెడ్డితండా గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.ఆయనను సర్పంచ్ నరేష్ నాయక్ శాలువా కప్పి పూల గుచ్ఛం ఇచ్చి సంతోషంగా, లంబాడిల సంస్కృతి నృత్యలతో మహిళలు నాట్యమాడుతూ ఆహ్వానించారు.గ్రామంలోని సేవాలాల్ మహారాజ్, జగదాంబ అమ్మవారులకు పూజలు నిర్వహించగా విఫ్ పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సర్పంచ్ నరేష్ నాయక్ ఆది శ్రీనివాస్ ను గ్రామ పాలక వర్గం, మాజీ ప్రజా ప్రతి నిధులను సన్మానించారు. ఎమ్మెల్యే నరేష్ నాయక్ ను పాలక వర్గాన్ని సన్మానించారు.అనంతరం ఆది మాట్లాడుతూ నూతన గిరిజన గ్రామ పంచాయితీలకు కేసీఆర్ ప్రభుత్వం పటించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం,సిఎం రేవంత్ రెడ్డి గిరిజన నూతన గ్రామ పంచాయితీలను పక్క భవనాలు నిర్మించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాష, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు ఎండి అజీమ్ ఫాష,. భాశెట్టి నాగరాజ్,ఉప సర్పంచ్ రాజు నాయక్,గిరిజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.