15 June, 2026 | 3:09 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యసేవలు అమోఘం

09-04-2026 12:28 AM
  1. బాలల హక్కుల కమిషన్ చైర్మన్  కే .సీతా దయాకర్ రెడ్డి

పీడియాట్రిక్ , మెటర్నిటీ సేవలపై హర్షం

కొత్తగూడెం, ఏప్రిల్ 8 (విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీమతి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి , కమిషన్ సభ్యులు  సింగరేణి ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పీడియాట్రిక్ (చిన్నారుల) , మెటర్నిటీ (ప్రసూతి) వార్డులను కమిషన్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్కడి వైద్య ప్రమాణాలు, మెరుగైన వసతులు ,ఆసుపత్రి నిర్వహణ తీరు పట్ల చైర్మన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.  కార్పొరేట్ ఆసుపత్రులకు సమానంగా వైద్య పరికరాలు అందుబాటులో ఉండటాన్ని కమిషన్ అభినందించింది.

పీడియాట్రిక్ వార్డులో చిన్నారులకు అందుతున్న ప్రత్యేక చికిత్సలను, నియోనేటల్ కేర్ యూనిట్ను పరిశీలించిన చైర్మన్  వైద్యులు , సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రసూతి వార్డులోని బాలింతలతో చైర్మన్ , సభ్యులు ముఖాముఖి మాట్లాడారు. డాక్టర్ల పర్యవేక్షణ, ఉచిత మందుల పంపిణీ , ఆసుపత్రి సిబ్బం ది అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని రోగులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ ,కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తో ,పాటు కమిషన్ సభ్యులు, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ యం ఓ) , కిరణ్ రాజ్ కుమార్, ఏసీఎంఓ, ఉష ,డిప్యూటీ  పర్సనల్ మేనేజర్  అవినాష్, సైకియాట్రిస్ట్ విశ్వమేది , పెడియాట్రిసియన్ , అజయ్ భోంస్లే, హెల్త్ ఆఫీసర్ లలిత , ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.