1 April, 2026 | 1:36 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

సీఎంల భేటీ స్వాగతించాల్సిందే

03-07-2024 01:02 AM

కేసీఆర్, జగన్ భోజనం చేసేందుకే భేటీ

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): పదేళ్లుగా పరిష్కారం కాకుం డా ఉన్న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించడం వల్ల విభజన సమస్యలు పరి ష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడు తూ.. గతంలో ఇరు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్,జగన్‌లు కూర్చొని చర్చించడం వల్ల విభజన సమస్యలు పరి ష్కారం అవుతాయి కావచ్చునని రెం డు తెలుగు రాష్ట్రాల ప్రజలు  భావించారని, కానీ వారు కేవలం కలిసి భోజనం చేశారే తప్ప ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.