calender_icon.png 20 January, 2026 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

19-01-2026 12:00:00 AM

నారాయణఖేడ్, జనవరి 18 : మాఘ అమావాస్య సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి దంపతులు బోరంచలోని ప్రసిద్ధి చెందిన సంగమేశ్వర ఆల యంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంజీర తీరంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ప్రత్యేక పుణ్యస్నాలను ఆచరించారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామా లకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొని సంగమేశ్వరుని దర్శించుకున్నారు.