calender_icon.png 20 January, 2026 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల్లో పటిష్ట బందోబస్తు

19-01-2026 12:00:00 AM

అదనపు ఎస్పి మహేందర్ 

మెదక్, జనవరి 18 :మాఘ అమావాస్య సందర్భంగా ఆదివారం ఏడుపాయలలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదు పాయాలు, భద్రతా చర్యలు, మహిళా భక్తుల రక్షణ తదితర అంశాలపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జాతరను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని సూచించారు.