19-01-2026 12:00:00 AM
గజ్వేల్ జనవరి18: ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో ఓసి అభ్యర్థుల ఆశలు ఆవిరైపోగా, బిసి వర్గానికి చెందిన ఆయా పార్టీల నాయకులు చైర్మన్ పీఠం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బి ఆర్ ఎస్ పార్టీలో రిజర్వేష న్లు ఖరారు నుండి ఆయా వార్డుల కౌన్సిలర్ల స్థానాలకు పోటీ చేయడానికి క్యూలు కడుతున్నారు.
పలువార్డులకు ఇప్పటికే అభ్యర్థుల ను ఖరారు చేయగా, రేపటిలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి కానున్నట్లు సమాచారం. మరికొందరు ఆశావ హులు సైతం స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల కోసం కసరత్తు కొనసాగుతోంది. ఆశావహులు తమకు అవకాశం ఉన్న వార్డుల కౌన్సిలర్ టికెట్లు ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
బిజెపి పార్టీలో అంతర్గతంగా చైర్మన్ పదవి ఆశావహులు తమను బలపరిచేందుకు ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఇప్పటికే అంతర్గత ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. గడిచిన కాలంలో దేశంలో జరిగిన మార్పు లు, పెరిగిన హైందవ స్ఫూర్తి తమకు కలిసి వస్తుందని బిజెపి పార్టీ నాయకులు భీమా వ్యక్తం చేస్తున్నారు.
వామపక్ష పార్టీలైన కౌన్సిలర్ టికెట్ల కోసం ఆయా పార్టీలకు చెందిన నాయకులు సిపిఎం సిపిఐ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో మున్సిపల్ లో కూడా అధికారంలో ఆ పార్టీ ఉన్నా ఎంతోమంది ఉద్యమకారులకు న్యాయం జరగక పోవడంతో పార్టీలు మారగా, మాజీ కౌన్సిలర్ తో పాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కౌన్సిలర్లుగా అవకాశం రానిపక్షంలో వేరే పార్టీలలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అన్ని పార్టీలకు రెబల్స్ ముప్పు
అసంతృప్త నాయకులు కార్యకర్తలతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని అన్ని పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులకు రెబల్స్ ము ప్పు తప్పేలా లేదు. కౌన్సిలర్లుగా గతం లో పోటీ చేసిన వారంతా భారీ స్థాయిలో డబ్బు సంపాదించడంతో కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అన్ని పార్టీలలో ఆశావహులు పెరిగి పోయారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలలో ఆశావహులు అధికంగా ఉండడంతో ఒక రకంగా కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీలకు కత్తి మీద సాములా మారింది. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ఒక ఎత్తు అయితే అసంతృప్త నాయకుల బుజ్జగింపు మరో చాలెంజ్ గా మార నుంది.
ఆ వార్డులే కీలకం
మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ మహిళ బీసీ జనరల్ కౌన్సిలర్ స్థానాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో కీలకంగా మారాయి. మున్సిపాలిటీలోని 20 వార్డులలో 11, 16,17 వా ర్డుల కౌన్సిలర్ స్థానాలు బీసీ మహిళలకు కేటాయించగా, 3,4,18,19 వార్డుల కౌన్సిలర్ స్థానాలు బీసీ జనరల్ కు కేటాయించారు. బిసి మహిళలకు కేటాయించిన వార్డులతోపాటు బీసీ జనరల్ స్థానాలలోనూ బీసీ మ హిళలు పోటీ చేస్తుండడంతో చైర్మన్ పదవికి భారీగా పోటీ ఏర్పడనుంది.
బీసీ జనరల్ స్థానాలలోనూ ఆయా పార్టీల నాయకులు బీసీ మహిళలను కౌన్సిలర్ గా పోటీ చేయించాలని నిర్ణయించుకోవడంతో గజ్వేల్ ప్రజ్ఞా పూర్ మున్సిపల్ రాజకీయం ఎంతో ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ని యోజకవర్గం కావడంతో అన్ని పార్టీలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గెలుపు ఛాలెంజ్ గా తీసుకుంటుండడంతో రాష్ట్రమంతా గజ్వేల్ వైపే చూస్తుంది. ఏ పార్టీ ము న్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందోనని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూ స్తున్నారు.