15 April, 2026 | 12:01 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ముగిసిన వింగ్స్ ఇండియా 2026

01-02-2026 03:03 AM
  1.    4 రోజుల్లో లక్షకు పైగా సందర్శకులు 
  2. చివరి రోజు 70 వేల మంది రాక 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026 శనివారం బేగంపేట విమానాశ్రయంలో అట్టహాసంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ ఆకాశంలో విన్యాసాల విందు చేశాయి. ఎయిర్ ఇండియా సంస్థ బోయింగ్ నుంచి అదనంగా మరో 30 నారోబాడీ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీనితో ఆ సంస్థ మొత్తం ఆర్డర్ల సంఖ్య 600కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

అలాగే ఎయిర్‌బస్ నుంచి 15 విమానాలను అత్యాధుని క మోడల్గా మా ర్చుకునే ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ విమాన తయారీ రంగం లో మైలురాయిగా.. హెచ్‌ఏఎల్  పవన్ హన్స్ మధ్య 10 ధవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ల సరఫరా కోసం ఎంఓయూ కుదిరింది. ఓమ్నిపోల్, శక్తి గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా భారత్లో ఎల్-410 ఎన్జీ విమానాల తయారీకి మార్గం సుగమమైంది.

మొదటి రెండు రోజులు వ్యాపార వర్గాలకే పరిమితమైన ఈ ఈవెంట్, చివరి రెండు రోజులు సామాన్య ప్రజల సందర్శన కోసం అనుమతించడంతో బేగంపేట పరిసరాలు జనసంద్రమ య్యాయి. శనివారం ఒక్క రోజే సుమారు 70 వేల మంది తరలివచ్చారు. మొత్తం నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా సా మాన్య ప్రేక్షకులు, 7,500 మంది వ్యాపార ప్రతినిధులు ఈ వైమానిక అద్భుతాన్ని వీక్షించారు. 150కి పైగా ప్రదర్శక సంస్థలు పాల్గొన్న ఈ ఈవెంట్లో 30 రకాల విభిన్న విమానాలు పర్యాటకులను ఆకర్షించాయి.