పులిమేడు ఆశ్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
02-01-2026 01:11 AM
మిర్యాలగూడ, జనవరి 1 (విజయక్రాంతి): పట్టణం లోని పులిమేడు ఆశ్రమంలో గురువారం జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలండర్ ని ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్డి కాలనీలో గడప గడపకు తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తున్న ఆశ్రమం స్వాములను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






