02-01-2026 01:12:25 AM
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
* కిక్కే... కిక్కు. నూతన సంత్సర వేడుకలు ఈసారి కొత్తపుంతలు తొక్కాయి. మద్యం ప్రియుల్లో జోష్ నింపగా.. ప్రభుత్వానికి కోట్ల వర్షం కురిపించింది. సర్కారు ఖజానాకు ఒక్క రోజే (డిసెంబర్31న) రూ.313 కోట్ల ఆదాయం వచ్చింది. గడిచిన ఐదు రోజుల్లోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.1,344 కోట్ల రాబడి వచ్చింది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ డంతో ఆబ్కారీశాఖ ఆల్‌టైమ్ రికా ర్డు సృష్టించింది. రానున్న మూడు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ను అతిసులువుగా చేరుకుంటా మన్న ధీమా వ్యక్తంచేస్తోంది.

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రతి ఏటా లిక్కర్ సేల్స్ పెరుగుతూనే వస్తోంది. 2025 డిసెంబర్ వరకు రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఫుల్‌గా మద్యం తాగేశారు. మధ్యాహ్నం నుంచే వైన్స్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. డిసెంబర్ 31న రూ. 313 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఐదు రోజుల (డిసెంబర్ 27-192, 28- 182, 29- 282, 30-375, 31-313 కోట్లు) వ్యవధిలోనే రూ. 1,344 కోట్ల విలువ చేసే లిక్కర్ అమ్మకం జరిగింది.
మొత్తంగా ఒక డిసెంబర్ నెలలోనే రూ. 5,050 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం ఆల్‌టైమ్ రికార్డుగా అధికారులు చెబుతన్నారు. గతేడాది డిసెంబర్ నెలలో రూ. 4,321 కోట్లు ఆదా యం వచ్చింది. ఈ డిసెబర్‌లో ఆదనంగా రూ. 729 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చిం ది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను అబ్కారీ శాఖ పెట్టుకున్న లక్ష్యానికి చేరువలోనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 40 వేల కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖ అంచనా వేయగా, 9 నెలల్లోనే రూ. 30,188 వేల కోట్ల ఆదాయం ఆర్జించి రికార్డును సృష్టించింది.
వచ్చే మూడు నెలల్లో (జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 వరకు) రూ. 10 వేల కోట్ల ఆదాయం రాబట్టేలా ఎక్సైజ్ శాఖ అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 36,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి గత ఆర్థిక సంవత్సరం కంటే అదనంగా రూ. 4ం వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్ పెరగడానికి పంచాయతీ ఎన్నకలతో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పెద్ద ఎత్తున అరికట్టడం కూడా ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే మద్యంపై అబ్కారీ శాఖ గట్టి నిఘా పెట్టడమే కాకుం డా.. ఈవెంట్స్‌లోనూ విదేశీ, ఇతర రాష్ట్రాల మద్యం వాడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ దాడులు చేస్తూ నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పట్టకుని కేసులు నమోదు చేస్తున్నారు.
దీంతో అక్రమ మద్యం రవాణాను కొంత మేర నివారించడంతో రాష్ట్రంలోని అధికారిక మద్యం అమ్మకాలు పెరిగాయని, తద్వా రా అదాయం కూడా పెరిగిందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఇక 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగకు మద్యం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే.. లిక్కర్ అమ్మకాలు పెరుగుతాయని, తద్వారా అనుకున్న లక్ష్యానికి రీచ్ అవుతామని అబ్కారీ శాఖ అంచనా వేసుకుంటోంది.