calender_icon.png 2 January, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంతుకోస్తు ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సర వేడుకలు

02-01-2026 01:10:22 AM

గరిడేపల్లి, జనవరి 1 (విజయక్రాంతి) : మానసిక ప్రశాంతత, దైవభక్తితోనే సాధ్యమవుతుందని అందుకే ప్రతి ఒక్కరూ దైవభక్తితో ముందుకు సాగాలని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పెంతుకోస్తు ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

మానవాళికి ఏసుక్రీస్తు బోధనలు ఆయన ప్రేమ త్యాగం అవసరమని అన్నారు. ముందుగా నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె గరిడేపల్లి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ శ్రీకాంత్, డేవిడ్, నూతన సంవత్సర సందేశాన్ని వినిపించారు.కార్యక్రమంలో పిట్ట మట్టయ్య, వెంకటయ్య, వీరబాబు, సైదులు, వినోద్, ప్రవీణ్, సతీష్, వినయ్, నాగార్జున సంఘం సభ్యులు పాల్గొన్నారు