ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
11-11-2025 06:21 PM
కాటారం/మహాదేవపూర్ (విజయక్రాంతి): భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మైనార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అస్రార్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ, కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్షాద్ భాయ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, వామన్ రావు, వరప్రసాద్, కోట సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు రాఘవేంద్ర, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు నయీమ్, కడార్ల నాగరాజు, మొహమ్మద్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.




