24 August, 2026 | 11:32 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్ రైటా!

18-06-2025 12:29 AM

సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఎక్కడ అణిచివేత, పీడనం దోపిడీ ఉంటుందో..అక్కడ ఉద్యమం ఉంటుందని, అందుకు అడిగినోడు నక్సలైట్... అడగనోడు ఆల్ రైటా ఆ .! అని ప్రముఖ సినీ నటుడు, దర్శకులు ఆర్. నారాయణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్  పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని  డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద సభ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన మహాధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఈ  కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్.  నారాయణ మూర్తి మాట్లాడుతూ చంపాల్సింది  అణిచివేతను దోపిడిని అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం, సిపిఐఎంఎల్ నేతలు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  తమ్మినేని వీరభద్రం, వేములపల్లి వెంకటరామయ్య, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, దాసోజు శ్రవణ్ కుమార్, నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావు, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.