calender_icon.png 19 January, 2026 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువిద్యలో రాణించాలి

19-01-2026 12:00:00 AM

డీఎస్పీ ఎన్. తిరుపతి రావు 

మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): విలువిద్య క్రీడలో పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మహబూబాబాద్ జిల్లా ప్రాంత విద్యా ర్థులు ఎదగడానికి  తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పిల్లలను ప్రోత్సహించాలని సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు,ఏసిపి సాదుల సారంగపాణి, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అ న్నారు. మానుకోట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో  సాదు ల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత వారం రో జులుగా నిర్వహించిన ఉచిత విలువిద్య (ఆర్చరీ) శిక్షణ శిబిరం ముగిసింది.

వినూత్న మైన విలువిద్య క్రీడలో రాణించడానికి సా రంగపాణి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ డం పట్ల డీఎస్పీ అభినందించారు.  విలువిద్య అభివృద్ధికి తన వంతు సహకారంగా ఒక ఆర్చరీ బోర్డును స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రస్ట్ అధ్యక్షుడు సాదుల సా రంగపాణి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాభివృద్ధికి దోహదపడే ఈ శిబిరాన్ని స్థానికులు, తల్లిదండ్రులు విశేషంగా ఆదరించారని, మానుకోట జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలంటే తల్లి దండ్రులు, విద్యాసంస్థలు పిల్లలను ప్రోత్సహిస్తూ అవసరమైన క్రీడా సౌకర్యాలు, సా మగ్రి అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి, సామాజికంగా బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా ట్రస్ట్ను స్థాపించామని తెలిపారు.

పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆర్చరీ అసోసి యేషన్, ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యు డు పుట్ట శంకరయ్య విలువిద్యలో ఉన్న అవకాశాలు, భవిష్యత్తులో యువతకు లభించే క్రీడా అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యు లు మనోజ్, సురేష్,  రఘువీర్, ఉపేందర్, సుంకరి జయంత్, పట్టణ ప్రముఖులు శ్రీరంగం మురళీకృష్ణ, హైస్కూల్ హెడ్ మా స్టర్ కేదాసు వాసుదేవ్ , మాలె యోగీశ్వర్, బోనగిరి గిరిధర్ గుప్తా, పరకాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.