5 March, 2026 | 6:48 PM

ఉప్పల్‌లో అభివృద్ధి పను వేగం

05-03-2026 12:00 AM

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షణ

కుషాయిగూడ, మార్చి 4 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం కాప్రా సర్కిల్ కుషాయి గూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్లో రూ.4.55 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాక్స్ డ్రెయిన్ పనులను సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసి, నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయి నగర్, శివ సాయి నగర్, మీనాక్షి నగర్ తదితర కాలనీలు ప్రతి వర్షాకాలంలో వరద మురుగు నీటి ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.4 కోట్ల 55 లక్షలతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పనులు పూర్తయ్యే సరికి ముంపు సమస్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.

ఈ కార్యక్ర మంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య (సీసీఎస్) అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, కొండగళ్ల అశోక్, రామకృష్ణారెడ్డి, రమేష్, రాజు గౌడ్, శివలింగం, కందుల సత్యనారాయణ, అశోక్, బిక్షపతి గౌడ్, శారదాంబ, శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.