5 March, 2026 | 5:01 PM

నాలుగవ తరగతి చదువుతున్న గిరిజన బాల బాలికలకు మోడల్ స్కూల్లో ప్రవేశం

05-03-2026 12:00 AM

భద్రాచలం, మార్చి 4 (విజయక్రాంతి): దారిద్ర రేఖకు దిగువనున్న గిరిజన బాలబాలికలకు 2026 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న బాలురు మరియు బాలికలు 9 నుండి 11 సంవత్సరాల మధ్య జన్మించిన వారికి మోడల్ క్రీడా పాఠశాలల్లో వివిధ ఫిజికల్ పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి ఐదవ తరగతిలో ప్రవేశం కల్పించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

బుధవారం తన ఛాంబర్ లో క్రీడా పాఠశాలలలో 5వ తరగతి ప్రవేశాల బ్రోచర్ ఆవిష్కరణ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ మరియు పిడి,పిఈటీలతో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో కిన్నెరసాని క్రీడా పాఠశాల (బాలురు)  40 సీట్లు, కచనపల్లి క్రీడా పాఠశాల (బాలికలు)  40 సీట్లు కేటాయించడం జరిగిందని, ఈ పాఠశాలల్లో చదివే గిరిజన విద్యార్థినీ విద్యార్థులకుఉచిత స్పోరట్స్ కిట్లుట్రాక్ సూట్లు, షూస్ ప్రత్యేక పోషకాహారం ప్రతిరోజు గుడ్డు మరియు పండు రాత్రి భోజనంలో చికెన్ కర్రీ, చపాతిక్యారెట్, కీర, దోస, బీట్రూట్ వారానికి రెండుసార్లు మటన్ అలాగే ప్రతిరోజుఉదయం 5:30 నుండి 8:00 వరకు గ్రౌండ్ యాక్టివిటీ, ఉదయం 9:45 నుండి సాయంత్రం 3:30 వరకు తరగతులు, సాయంత్రం నాలుగు గంటలకు  స్నాక్స్, సాయంత్రం 4:00 నుండి 6:00 వరకు గ్రౌండ్ యాక్టివిటీ, రాత్రి 7:30 నుండి 9:30 వరకు సూపర్వైజర్ స్టడీ ఉంటుందని,విద్యార్థులకు క్రీడలతో పాటు విద్యపై ప్రత్యేక దృష్టిప్రభుత్వ ఉద్యోగాల్లో 2%క్రీడా కోటా ఉంటుందని అన్నారు.కిన్నెరసాని &కాచనపల్లి క్రీడా పాఠశాలల నుండి ఆర్చరీ, అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో 50 మందికి పైగా జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారని ఆయన అన్నారు.  క్రీడల అధికారి బొల్లి గోపాలరావు, ఏ ఎస్ ఓ  ఎస్. నాగేశ్వరరావు,కొమరం వెంకటనారాయణ,బండ రాంబాబు,పీడీలు ఎస్. బాలసుబ్రమణ్యం, పి. రాంబాబు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.