8 April, 2026 | 1:06 PM

మంత్రిని కలిసిన పంచాయతీ పాలకవర్గం

10-01-2026 12:00 AM

మానకొండూరు, జనవరి 9 (విజయ క్రాంతి ): మానకొండూరు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కరీంనగర్ లో కలిశారు. మానకొండూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై మంత్రికి తెలియజేశారు. సమస్యపై మంత్రి బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మాజీ జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మంగబత్తుల స్వప్న, బాష బోయిన ప్రదీప్ యాదవ్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.