calender_icon.png 11 January, 2026 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే సత్తా

10-01-2026 12:00:00 AM

నిర్మల్ జనవరి 9 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ బిజెపికి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటుతామని జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం  జిల్లా కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను సన్మా నం చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు అన్ని విధాలా మోసం చేశాయని ప్రజలు తిరిగి కేసీఆర్ నాయక త్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు భూషణ్ రెడ్డి చిన్నారెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.