calender_icon.png 11 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో శారీరక ధారుడ్యం

10-01-2026 12:00:00 AM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, జనవరి 9 (విజయ క్రాంతి): క్రీడలు స్నేహభావం. శారీరక దారుడ్యానికి దోహద పడుతాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ లో వార్షిక స్పోరట్స్ మీట్ పోటీలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. 100, 200, 400, 800, 5 కిలోమీటర్ల పరుగు పందెం, క్రికెట్, వాలీబాల్, షెటిల్, క్యారం, చెస్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం ముగింపు పోటీలు నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ముందుగా పోలీస్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం వంద మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ పోటీలను ఇంచార్జి కలెక్టర్, బెటాలియన్ కమాండెంట్ సురేష్ తో కలిసి ప్రారంభించారు. వంద మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి తిరుపతి, రెండో బహుమతి శ్రీహరి, మూడో బహుమతి సురేష్ నిలిచారు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో కంపెనీ ఏ జట్టు, ఎస్డీఆర్‌ఎఫ్ జట్లు రెండు రౌండ్లలో హోరాహోరీగా తలపడ్డాయి. రెండు రౌండ్లలో ఎస్డీఆర్‌ఎఫ్ జట్టు మంచి టీం వర్క్, సరైన పట్టుతో విజయం సాధించింది. విజేతలకు ఇంచార్జి కలెక్టర్, బెటాలియన్ కమాండెంట్ బహుమతులు అందజేసి, అభినందించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. వార్షిక క్రీడలు రోజువారి ఒత్తిడిని దూరం చేస్తాయని, ఉద్యోగుల అందరి మధ్య స్నేహభావం, జట్టుగా ఎలా గెలుపు సాధించాలి అనే విషయాలకు దోహదం చేస్తాయని తెలిపారు. ఆటలతో శారీరక దారుడ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఫిట్ నెస్ ఎంత కీలకమో ఆటలు ఆడడం ద్వారా తెలుస్తుందని, రోజు యోగా, వ్యాయామం, నడక ఏదైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు.

తానూ 2019లో ఐపీఎస్ గా ఎంపిక అయి శిక్షణ తీసుకున్నానని, ఇక్కడ ఉన్న అందరినీ చూస్తే తానూ నేర్చుకున్న అంశాలు అన్ని గుర్తుకువస్తున్నాయని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఫిట్ నెస్, క్రమశిక్షణ తదితర అంశాలు నిత్య జీవితంలో ఉత్తమ ప్రతిభ చూపేందుకు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం, డ్రెస్ కోడ్ అనేది క్రమశిక్షణ, సేవ భావం, ప్రజల భద్రతకు తాము ఉన్నామనే భావన కలిగిస్తుందని తెలిపారు.

బెటాలియన్, ఎస్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో వరదలు వచ్చినప్పుడు బాధితుల రక్షణ, సురక్షిత ప్రాంతాలకు తరలింపు, ఎన్నికల బందోబస్తు, జాతరల వద్ద ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని ఇన్ ఛార్జ్ కలెక్టర్ కొనియాడారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, సురేష్, ఆర్‌ఐలు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యాం రావు, రాంబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.