12-11-2025 12:00:00 AM
దౌల్తాబాద్, నవంబర్ 11 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి శివారు అటవీలో సంచరిస్తున్న 10 సంవత్సరాల చిరుత మంగళ వారం ఉదయం మృతి చెందిందనీ ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. చిరుత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్య, నిమోనియాతో బా ధ పడుతోందని, వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా నిర్ధారించబడిందని తెలిపా రు.
వెటర్నరీ నిపుణులతో చిరుత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించమన్నారు. చిరుత ఊపిరితిత్తుల వ్యాధి, నిమోనియాతో బాధపడుతూ ప్రాణా లు కోల్పోయినట్లు ప్రాథమికంగా తే లిందనీ, చిరుత మృతదేహానికి శాఖ నియమాల ప్రకారం దహనం చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు.