నాకు నా పాలేరు ప్రజలే ముఖ్యం
కూసుమంచి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన కందాళ
కూసుమంచి, జూన్ 7 (విజయక్రాంతి): పాలేరు ప్రజల కష్టసుఖాల్లో నేను తోడుంటా... మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను తోడుంటా అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నానని హామి ఇచ్చారు. పార్టీలకతీతంగా సహాయం అందిస్తున్నానని, నాకు పాలేరు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు.
కూసుమంచి మండలం కోక్యతండ గ్రామం ఇటీవల కాలంలో యాక్సిడెంట్ కి గురి అయిన హలవత్ ప్రతాప్ % బద్రు, కేశవాపురం గ్రామం డీలర్ ఇంటూరి నారాయణ సతీమణి ప్రమీల దశదిన కార్యక్రమానికి హాజరైన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించిన పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ప్రజలను అప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ సర్పంచులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు






