లీక్ చేసినోడు మెంటలోడు!
ప్రధాని మోదీతో సమావేశం
వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా?
వాడెవడో తెలిస్తే వెంటనే చర్యలు ఉంటాయి
ఐకమత్యంతో పనిచేయాలని ప్రధాని చెప్పారు
ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రధాని మోదీ సమావేశానికి సం బంధించి వచ్చిన లీకులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టి నోడు మెంటలోడని, వాళ్లెవరో తెలిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీతో సమావేశమైన వివరాలను బయటపెట్ట డం మంచిది కాదని తెలిపారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా అని అన్నారు. భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని చెప్పినా.. లీక్ చేశారని కిషన్‌రెడ్డి చెప్పారు.
మంగళవారం ఢిల్లీలో మీడియాతో కిషన్‌రెడ్డి చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో చర్చించిన అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు. అయి తే ఆ రోజు ప్రధాని మోదీతో జరిగిన సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పా రు.
గతవారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఆగ్ర హం వ్యక్తంచేసినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని, సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా లేరని.. మీకంటే అసదుద్దీన్ ఒవైసీ నయమంటూ మండిపడ్డారని ప్రచారం జరి గింది. ఏపీలోనూ వైఎస్ జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలని అటు తెలంగాణ ఎంపీ లు, ఇటు ఏపీ ఎంపీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చా యి. ఈ నేపథ్యంలో స్పందించిన కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
రాహుల్ వ్యాఖ్యలు సరికావు..
ఓటు చోరీ సభలో ప్రధానమంత్రిపైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అనైతికంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రా హుల్ గాంధీ లాంటి నాయకుడు లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టకరమని తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని అన్నారు.
కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్..
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం వేగవంతం చేయడంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు ఆయ న చెప్పారు. త్వరలోనే కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. రూ. 400 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులపైనా చర్చించినట్లు ఆయ న పేర్కొన్నారు.






