మీ కుటుంబమే నన్ను ఓడించింది..
17-12-2025 01:09 AM
- బాలింతపై ఓడిన వార్డ్ సభ్యురాలి దాడి
- కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో ఘటన
శంకరపట్నం, డిసెంబరు 16 (విజయక్రాంతి): తనకు ఓటేయకుండా, ఓటమికి కారణమయ్యారంటూ ఓడిన వార్డు సభ్యురాలు తన పక్కింటి కుటుంబ సభ్యులపై దాడికి దిగిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలం గూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మొలంగూర్ గ్రామంలో ఎనిమిదవ వార్డు సభ్యు రాలిగా పోటీ చేసిన కమురున్నీస ఓడిపోయింది.
తన పక్కింటి వారైనా రేషన్ డీలర్ దాసరి పద్మ, ఆమె కుమార్తె ప్రియాంక ఓట్లు వేయనందునే ఓడిపోయానని భావించిన కమురున్నీస వారిపై మంగళవారం దాడికి దిగింది. ప్రియాంక బాలింత అని చూడకుండా దాడికి పాల్పడింది. బాధితులను 108 అంబులెన్సులో హుజురాబాద్ ఏరి యా ఆసుపత్రికి తరలించారు.




