4 September, 2026 | 7:16 AM

‘గీత’లో జీవనతత్వం

04-09-2026 | 05:35am

నేడు శ్రీకృష్ణాష్టమి :

శ్రీకృష్ణాష్టమి అంటే ఒక పండుగ మాత్రమేనా? దేవాలయాల్లో పూజలు చేయడం, ఇళ్లలో ఉట్ల పండుగలు నిర్వహించడం, చిన్నారులకు కృష్ణుడి వేషధారణ చేయించడం వరకేనా? లేక వేల సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడి జీవితం, ఆయన ఆలోచనలు, భగవద్గీతలోని బోధనలు నేటి మనిషి జీవితానికి కూడా దిశానిర్దేశం చేయగలవా? కాలం మారింది.. సాంకేతికత మారింది.. జీవన విధానం మారింది. కానీ, మనిషి ఎదుర్కొనే ధర్మసంకటాలు, బాధ్యతలు, అన్యాయం, ఒత్తిడి, సంబంధాల విలువ, విజయంపై ఆందోళన మాత్రం మారలేదు.

అందుకే శ్రీకృష్ణుడు నేటికీ కేవలం ఆరాధ్య దైవం కాదు.. జీవన తత్వాన్ని నేర్పిన మహత్తర మార్గదర్శి. శ్రీకృష్ణుడి జీవితం ప్రారంభం నుంచే సవాళ్లతో నిండినది. అయినా ఆయన ఎక్కడా కుంగిపోకూడదు. పరిస్థితులను అర్థం చేసుకుని పరిష్కార మార్గాన్ని వెతకాలనే జీవన సూత్రాన్ని ఆయన జీవితం మనకు గుర్తుచేస్తుంది. నేటి తరం చిన్న అపజయం వచ్చినా నిరాశ చెందుతున్న సమయంలో శ్రీకృష్ణుడి జీవితం ధైర్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

బాలకృష్ణుడి లీలల్లో కనిపిం చే చిలిపితనం, ఆనందం, స్నేహం, కుటుంబ అనుబంధం మన సం స్కృతిలోని సంతోషాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే శ్రీకృష్ణుడి గొప్పత నం కేవలం బాల్యంలోని లీలల్లోనే లేదు. ధర్మం కోసం నిలబడటం, అన్యాయాన్ని ఎదుర్కోవడం ఆయన జీవితంలోని ప్రధాన సందే శం. మహాభా రత సందర్భంలో ఆయన ఆయుధం ఎత్తకుండానే ధర్మపక్షానికి మార్గదర్శకుడయ్యారు. దీనిలో నేటి తరానికి ఒక ముఖ్యమైన పాఠం ఉంది.

అన్యా యం కనిపించినప్పుడు నాకెందుకు? అని పక్కకు తప్పుకోవడం సులభం. కానీ సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం లేకపోతే న్యాయం బలహీనమవుతుంది. ఈ సందేశానికి అత్యున్నత రూపం భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి మనసులో ఏర్పడిన సందేహం కేవలం ఒక యోధుడి సందేహం కాదు. బాధ్యత ముందున్నప్పుడు మనిషికి కలిగే మానసిక సంఘర్షణకు అది ప్రతీక. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని గుర్తుచేశాడు.

‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే గీతా బోధనలోని ప్రధాన భావం మనిషి తన కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వర్తించాలి; ఫలి తంపై అనవసరమైన ఆందోళనతో కర్తవ్యాన్ని విస్మరించకూడదు. నేటి తరానికి ఇది అత్యంత అవసరమైన సందేశం. శ్రీకృష్ణుడి జీవితంలో స్నేహానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీకృష్ణుడు బంధం స్నే హం అంటే సంపద, హోదా, అధికారాల ఆధారంగా ఏర్పడేది కాదని చె బుతుంది.

కాలం మారినా, పరిస్థితులు మారినా నిజమైన అనుబంధం మారకూడదు. శ్రీకృష్ణుడి తత్వంలో మరో ముఖ్యమైన అంశం వివేకంతో కూడిన కార్యాచరణ. ధర్మం కోసం నిలబడటం అంటే ప్రతి సందర్భంలో ఆవేశంతో స్పందించడం కాదు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి, పరిణామాలను అంచనా వేయాలి, సరైన సమ యంలో సరైన నిర్ణయం తీసుకోవా లి. నేటి తరానికి ఈ వివేకం అత్యవసరం. శ్రీకృష్ణాష్టమి మన సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందించే ఒక గొప్ప అవకాశం.

కానీ సంప్రదాయం అంటే కేవలం ఆ చారం కాదు; దాని వెనుక ఉన్న విలువను కూడా పిల్లలకు చెప్పాలి. కృష్ణు డి వేషం వేయించడంతో పాటు స త్యం చెప్పడం, తల్లిదండ్రులను గౌరవించడం, స్నేహితుడికి అండగా నిలవ డం, అన్యాయాన్ని ప్రశ్నించడం, తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం నేర్పితేనే ఆ పండుగ విలువ మరింత పెరుగుతుంది. దేవుడిని పూ జించడం ఎంత ముఖ్యమో.. ఆయన బోధించిన విలువలను ఆచరించడం అంతకంటే ముఖ్యమైనది.

దుండ్ర కుమారస్వామి 

 వ్యాసకర్త: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, 9959912341