26 February, 2026 | 4:38 AM

కేజీ బీవీలో విద్యార్థినుల అవస్థలు!

26-02-2026 12:12 AM

కల్వకుర్తి / ఊరుకొండ ఫిబ్రవరి 25: నా గర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలంలో కేజీబీవీ బాలికల విద్యాలయ భవనం నిర్మా ణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్పటి ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి సుమారు రూ.3 కోట్ల నిధులతో భూమిపూజ చేసి నిర్మాణ పనులు ప్రా రంభించారు. గుత్తేదారు పనులు చేపట్టినా, తరువాత ఎన్నికలు జరగడం, ప్రభుత్వ మా ర్పు కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చివరి బిల్లు చెల్లించకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది.

తుది దశలో ఉన్న నిర్మాణ పనులు 

భవనానికి రంగులు వేయడం వరకు ప నులు పూర్తయ్యాయి. కేవలం తలుపులు, కిటికీలు అమర్చడం వంటి చిన్నపాటి పను లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ రెండు సంవత్సరాలుగా భవనం నిరు పయోగంగా మారి నిలిచిపోయింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది. మండలానికి మంజూరైన కేజీబీవీ ప్రస్తుతం కల్వకుర్తి పట్టణంలో ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు 300 మంది విద్యార్థినులు చిన్న నివాస గృహంలోనే చదువులు, వసతి నిర్వహించుకోవాల్సి వస్తోంది.

ఆటల కోసం స్థలం లేక పోవడం, ప్రార్థనలకు గ్రౌండ్ లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థినులకు ఇబ్బందిగా మారాయి. చదువు, బస అన్నీ ఒకేచోట ఉండటంతో తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, భవనం అందుబాటులో లేకపోవడంతో ఈ పాఠశాల ఇంకా అద్దె భవనంలోనే కొనసాగు తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ఉరుకొండ కేజీబీవీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వి ద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.