26 February, 2026 | 4:14 AM

నరకానికి రహదారి.. షేకాపూర్ రోడ్డు!

26-02-2026 12:17 AM
  1. గుంతల మయంగా మారిన రోడ్డు 

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం

ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోని పాలకులు, అధికారులు      

జహీరాబాద్, ఫిబ్రవరి 25 : వాహనదారులు క్షేమంగా గమ్యం చేరాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి...కానీ అధ్వాన్నంగా మారిన రోడ్డుపై వెళ్ళాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. జహీరాబాద్ నుండి తాండూర్ కు వెళ్లే రోడ్డు షేకాపూర్ వరకు అధ్వానంగా మారింది. ఈ రోడ్డు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు మరమ్మతు గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యా రు.

ప్రజా ప్రతినిధులు గానీ, అధికారులు గానీ రోడ్డు గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వి మర్శిస్తున్నారు. ఈ రోడ్డు జహీరాబాద్ నుం చి మొదలుకొని తాండూర్ వరకు వెళ్తుంది. మధ్యలో కోతి కే తాండ, షేకాపూర్ మల్చల్మ, గుడిగారిపల్లి, సిద్ధాపూర్, బడంపేట గ్రామాలకు వెళ్లే ఈ రోడ్డుపై ప్రతిరోజు వేలాదిగా వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఈ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు నరకయాతంగా మారింది.

రోడ్డును మరమ్మత్తు చేయడంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచిన బాగారెడ్డి స్వగ్రామమైన మల్చల్మ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్ళదీస్తున్నారు.

ఈ రోడ్డు పై వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు ప్రా ణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. షెకాపూర్ నుండి బరంపేట వరకు వెళ్లే రోడ్డు కూడా గుంతలుగా మారి ప్రయాణం చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. ఈ రోడ్డుపై వేల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏ మేరకు ప్రజలకు సేవ చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఇ ప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని జహీరాబాద్ నుండి షెకాపూర్ మీదుగా తాండూర్ వరకు వెళ్లే రోడ్డు ను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.