11 March, 2026 | 2:56 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలి

10-06-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్9 ( విజ యక్రాంతి): నూతనంగా అమలుపరుస్తున్న పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఐ ఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకే ష్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరోజ్ గార్డెన్‌లో జిల్లాలోని కేబుల్ ఆపరేటర్ యూనియన్ సమావేశంలో హాజరై వారు మాట్లాడాతూ నూతన పోల్స్ టాక్స్ విధానంతో కేబుల్ ఆపరేటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

కార్పొరేట్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్లు కొట్టుమిట్టాడుతూ జీవనం కొనసాగిస్తున్నారని నూతన పాలసీల ద్వారా వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ వైర్ సవరణ కొరకు సమయం ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు క్యాటగిరి 1 క్రింద గుర్తించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించి కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందించి ఉద్యమించడం జరుగుతుందన్నారు.

కేబుల్ ఆపరేటర్ల హడక్ కమిటీ ఎన్నిక

కేబుల్ ఆపరేటర్ల హడక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేబుల్ ఆపరేటర్ సం ఘం ముఖ్య సలహాదారులుగా అల్లూరి లోకే ష్ , అబ్దుల్ రహమాన్ , కన్వీనర్ గా సాజిద్ , కో కన్వీనర్‌గా జుంగోని అశోక్ గౌడ్ , సభ్యులుగా అబ్దుల్ వహీద్ ఖాన్, దిలీప్ , కిరణ్ , స్వప్న , సంపత్ , జమీల్, సాయికృష్ణ , నగేష్ లను ఎన్నుకున్నారు.