calender_icon.png 10 June, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలిద్దాం

10-06-2025 12:00:00 AM

మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి) : జిల్లాలో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కు సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్‌తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ 18 ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదని, ఎవరైతే 18 ఏండ్లలోపు పిల్లలతో పని చేయించినట్లయితే వారిపై చట్టప రమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తు న్నట్లు కనిపిస్తే ఉచిత నెంబర్ 1098లో సమాచారం అందించాలని, అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ.ఎల్ ఓ. రామ్మోహన్, డిసిపిఓ ఆనం ద్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్ హెల్ప్ లైన్ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్ పాల్గొన్నారు.