14 June, 2026 | 4:18 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్త్

09-02-2026 12:00 AM

ఎస్పీ నరసింహ

సూర్యాపేట, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ఈనెల 11వ తేదీన జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామన్నారు.

ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో మొత్తం 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 1250 మంది పోలీసు సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించామన్నారు.