4 July, 2026 | 8:52 PM

Breaking News

కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •  

చెరువు కరువు.. పెరుగని బరువు

22-05-2025 12:00 AM
  1. ఈ సంవత్సరం చేపల వృద్ధి అంతంతే
  2. నీరు పుష్కలంగా ఉంటే ఆరు నెలల్లోనే.. 2 నుంచి ౩ కేజీల బరువు 
  3. ప్రస్తుతం కేజీకి మించడం లేదని ఆవేదన 
  4. ఆందోళన చెందుతున్న మత్స్యకారులు, వ్యాపారులు

నిర్మల్, మే 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువుల్లో నీటి కరువుతో చేపల బరువుపై ప్రభావం చూపిం ది. జిల్లావ్యాప్తంగా 100 శాతం సభ్యుడిపై చేప పిల్లల పెంపకం మత్స్య శాఖ ఆధ్వర్యం లో చేపట్టగా ఈ సంవత్సరం చెరువుల్లో వదిలిన చేప పిల్లల్లో ఎదుగుదల లేకపోవడంతో దిగుబడులపై మత్య్స కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం అనుసరించిన చేప పిల్లల పథకమే ఇందుకు ప్రధాన కారణమని మత్స్య కార్మికులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సాగునీటి చెరు వులతో పాటు ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ కడెం గడ్డిన వాగు పాలసీ రంగారావు ప్రాజెక్ట్ స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ చేపట్టారు. జిల్లాలో మొత్తం 222 మత్స్య కార్మిక సంఘాలు ఉన్నాయి. జిల్లాలో 13,121 మత్స్య కార్మికులు చేపల వృత్తినే జీవనాధారంగా తీసుకొని కాలం వెల్లదిస్తున్నారు.

జిల్లాలో 19 మండలాలతో పాటు నిర్మల్ బైంసాం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 569 చెరువుల్లో ఈ సంవత్సరం చేప పిల్లలను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతోపాటు శ్రీరాంసాగర్ గడ్డిన వాగు స్వర్ణ ప్రాజెక్టు కడెం పాలసీ రంగారావు ప్రాజెక్ట్ ప్రాజెక్టుల్లో 4.50 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం 2.14 కోట్ల చేప పిల్లలను చెరువులు ప్రాజెక్టులో విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

చేప పిల్లల పెంపకానికి జీవనాధారమైన చెరువులు ప్రాజెక్టులు గోదావరి పర్యాయక ప్రాంతాల్లో చేప పిల్లలు విడుదల రెండు నెలలు ఆలస్యంగా కావడంతో చేప పిల్లల విడుదల జాప్యం జరిగి నీటి కొరత ఏర్పడి చేప పిల్ల అభివృద్ధి కనిపించడం లేదని మత్స్య కార్మికులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు మాసంలో చేప పిల్లలను ప్రభుత్వం విడుద ల చేస్తుండగా అవి మార్చి చెప్పిన నాటికి ఎదుగుదల కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో చనిపోతున్నాయి

నిర్మల్ జిల్లాలో చేప పిల్లల పెంపకంలో ఈ సంవత్సరం ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు సాగునీటి చెరువులు ప్రాజెక్టులో నీటి పరిణామం తగ్గిపోవడంతో చేప పిల్లల బరువుపై ప్రభావం చెప్పినట్టు మత్స్యకారులు తెలిపారు. జులై, ఆగస్టు మోసం వరకు వర్షాలు కురవగా ఆ తర్వాత అక్టోబర్ నుం చి వర్షాలు తగ్గుముఖ పట్టడంతో చెరువులు ప్రాజెక్టులు నీటి నిలువలు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వరకు చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండేది. కానీ ఈ సంవత్సరం చేప పిల్లలు పెంచిన చెరువుల్లో అక్టోబర్ జనవరి నాటికి నీటి శాతం 50 శాతం పడిపోగా ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే నీరు ఉండడంతో చేప పిల్లల్లో వృద్ధి చెందడానికి ఆటంకం ఏర్పడుతుంది.

చెరువులు సాగునీటి వనరులు నీటి పరిణామం ఎంత ఎక్కు వగా ఉంటే చేప పిల్లలకు అంత ఆహారం లభిస్తుందని నీటి శాతం పడిపోవడంలా ఆహారం లభించక సరైన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల చేప పిల్లలు నీటి పరిణామం తక్కువ కావడంతో కొన్ని ప్రాంతాల్లో చనిపోతున్నాయని కొన్ని ప్రాంతాల్లో కావలసినంత బరువు చేప పిల్లలు పెరగలేదని మత్స్య కార్మికులు తెలిపారు.

సాధారణంగా మత్స్యశాఖ 80, 120 మిల్లీగ్రాముల చేప పిల్లలను విడుదల చేయ గా నీరు పుష్కలంగా ఉంటే ఆరు నెలల్లోని రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు ఉండేదని ప్రస్తుతం కేజీకి మించిన బరువు ఉండటం లేదని మత్స్యకారులు తెలిపారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న చెరువు లోనైతే 700 గ్రాముల నుంచి కేజీ వరకు మాత్రమే చేపల బరువు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఈ సంవత్సరం సాగునీటి చెరువులు ప్రజల కింద ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 25 వేల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేసినప్పటికీ అది 16 నుంచి 18 వేల టన్నుల వరకు ఉండే అవకాశం ఉందని మత్స్యకార్మికులు తెలిపారు.

చెరువుల వద్ద రాత్రి పగలు కాపలా

చేపల వృత్తినే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న మచ్చ కార్మికులకు ఈ ఏడు ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు చెరువుల్లో నీటి కొడతా వారి ఉపాధికి గండి కొట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేయడం అక్టోబర్ తర్వాత వర్షాలు కురవకపోవడం చేపల వృద్ధి చెందకపోవడానికి కారణమని ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని మత్స్య కార్మికులు కోరుతున్నారు. చేపల వృత్తి తప్ప తమకు ఏ ఆధారం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రస్తుతం కొన్ని చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో చేప పిల్లలు నీటి బయటకు రావడంతో పక్షులు, స్థానికులు వాటిని తినేస్తున్నారని చెరువుల వద్ద రాత్రి పగలు కాపలా కావలసి వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో చేపల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న నిర్మల్ లో ఉత్పత్తి బరువు పరిణామం తగ్గిపోవడంతో చేపల వ్యాపారని చేస్తున్న వ్యాపారులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది.

గతంలో ఇక్కడ ఉత్పత్తి అయిన చేపలు కలకత్తా నాగపూర్ హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రవాణా చేసే వారిని ఇప్పుడు ఆర్డర్లు ఉన్న వారికి డిమాండ్ దగ్గర సరఫరా చేయలేకపోతున్నామని మత్స్య వ్యాపారులు వివరించారు.

సమస్య మా దృష్టికి వచ్చింది

ఈ ఏడాది ఏర్పడ్డ వర్షపాతం పరిస్థితులు సాగునీటి ప్రాజెక్టులు చెరువుల్లో నీటి కొరత కారణంగా చేపలు వృద్ధి చెందలేదని పనులు మత్స్య కార్మికులు తమ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఏడాది 2.14 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 25 వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసినప్పటికీ అది తగ్గిపోయే అవకాశం ఉంది. మత్య్సకారులు చెరువుల్లో చేపలు వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి. మత్య్సకారులను ప్రభుత్వాన్ని ద్వారా అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం.

 రాజనరసయ్య, జిల్లా అధికారి