calender_icon.png 22 May, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ

22-05-2025 12:00:00 AM

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘన నివాళి

సంగారెడ్డి, మే 21 (విజయక్రాంతి): దేశానికి సాంకేతికతను తీసుకుని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్ గాంధీనేనని మెదక్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

మెదక్ పట్టణంలో పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రపాల్,  మేడి మధుసూదన్ రావు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, దుర్గ ప్రసాద్, నాయకులు గంగాధర్, ఉమర్, శంకర్,  నాగిరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, గాడి రమేష్, దేవుల, దాయర రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫిజ్ మొల్సాబ్, సలీమ్, స్వరూప, సూపి, ముజాంబిల్ తో పాటు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో నిర్మలా జగ్గారెడ్డి నివాళి...

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని రాజీవ్ పార్కులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అణగారిన బతుకుల్లో వెలుగు నింపిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

చేగుంటలో...

చేగుంట, మే 21 : చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సాముద్దీన్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, మండల్ యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, జర్నల్ సింగ్, పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాళి..

నారాయణఖేడ్, మే 21: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను నారాయణఖేడ్  స్థానిక ఎమ్మెల్యే నివాసంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహానీయుడని ఎమ్మెల్యే కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు వివేకానంద, మాజీ ఎంపిటిసి పండరి రెడ్డి, రామకృష్ణ, దత్తు గౌడ్, న్యాయవాది సంగన్న , శంకర్ ముదిరాజ్, సంజీవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వహీద్, గైని సంగమేశ్వర్ , పండరినాథ్ పాల్గొన్నారు.