31 July, 2026 | 3:45 AM

లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో వనమములై పీఠాధిపతి

31-07-2026 02:18 AM

యాదగిరిగుట్ట, జులై 30 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని వనమములై పీఠాధిపతి మధురకవి వనమములై జీయర్ స్వామి దర్శించుకున్నారు.   ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకున్నానంతరం దేవస్థానం కార్యనిర్మాణాధికారి భవాని శంకర్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య పూజలను అర్చకులు నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకము,అర్చన, సుదర్శన నరసింహ హోమం, స్వామివారి నిత్య కల్యాణం, సాయంత్రం వెండి జోడు సేవ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి నిత్య రాబడి రూ.13,19,177లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.