calender_icon.png 12 December, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెటిక్స్ పోటీల్లో హయత్ నగర్ డిగ్రీ విద్యార్థుల సత్తా

10-12-2025 02:45:14 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 9 : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  నిర్వహించిన సింథటిక్ ట్రాక్లో అథ్లెటిక్ టోర్నమెంట్లో  హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటి, పతకాలు సాధించారు. గెలుపొందిన విద్యార్థులను మంగళవారం హయత్ నగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత తెలిపారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాల యంలో  నిర్వహించిన సింథటిక్ ట్రాక్లో  అథ్లెటిక్ టోర్నమెంట్లో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు.

బీఏ సెకండియర్ చదువుతున్న ధోని 5 కి.మీ పరుగులో మొదటి స్థానం, 1.5కి.మీ పరుగులో రెండో స్థానం సాధించి, 2026 జనవరిలో బెంగళూరులో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్ మీట్కు అర్హత సాధించారు. ఇతర పోటీల్లో బీ.కాం ఫస్టియర్ విద్యార్థి ఎన్. సౌమ్య 10కి.మీ పరుగులో రెండో స్థానం సంపాదించింది. బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థి కె.బిందు 800మీ పరుగులో మొదటి స్థా నం, 400మీ పరుగులో రెండో స్థానం సం పాదించింది.

బీకాం ఫస్టియర్ విద్యార్థి భానుప్ర సాద్ 400మీ పరుగు పోటీల్లో మూడో స్థానం సాధించాడు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూఏఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మధు, అకడమిక్ కోఆర్డినేట ర్ డాక్టర్ నర్సింహ, లైబ్రేరియన్ డాక్టర్ దుర్గా ప్రసాద్, అధ్యాపకులు అభినందించారు.