తైక్వాండోలో శ్రీ చైతన్య విద్యార్థుల సత్తా
బెంగళూరులో జరిగిన పోటీల్లో అత్యధిక పతకాలు కైవసం
హైదరాబాద్, జూలై 30(విజయక్రాంతి): బెంగళూరులో విఫా సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ 2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రేటర్ వరంగల్ మహా నగరానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల హం టర్ రోడ్ ఐపీఎల్ బ్రాంచ్‌లో చదువుతున్న విద్యార్థులు సత్తా చాటి అత్యధిక పతకాలు కైవసం చేసుకున్నారు.- ఎం అయాన్ కృష్ణ (రెండు బంగారు), సీహెచ్ ఆధ్య (ఒకటి బంగారు, ఒకటి రజత), ఎన్.సిరి తన్మయి (రెండు బంగారు),
ఎస్.అక్షర (రెండు బంగారు), జీ. విశృత (ఒక బంగారు ఒక రజత), డీ. సాయి కీర్తన (రెండు బంగారు), ఏ. హశ్విత (రెండు బంగారు), ఏ.శివాణి (ఒక బంగారు, ఒక రజత) మొత్తం 16, 13 బంగారు, 3 రజత పథకాలు సాధించారు. శిక్షకుడు తొనుగోరు నవీన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ సత్తా చాటిన శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు. వీరిని పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ విద్య, ఏజీఎం మనోహర్, కో-ఆర్డినేటర్ శివ కోటేశ్వర్, ప్రధానోపాధ్యాయులు సంగం సురేష్, డీన్ రంజిత్, ఇన్‌చార్జి సన్నీ, రమాదేవి, ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్ఛాలతో అభినందించారు.






