శిలను శిల్పం చేసే శక్తి ఉపాధ్యాయులకే సాధ్యం
అపజయం సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలి
ప్రతి విద్యార్థికి ఏదో ఒక శక్తి ఉంటది.. వెలికి తీయండి
దేశ భవిష్యత్తు విద్యార్థులు ఉపాధ్యాయుల చేతుల్లోనే
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): శిలను శిల్పాను చేసే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఐడిఓసిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 19,775 మంది విద్యార్థులు, మొత్తం 192 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, డ్రాప్స్ ఔట్ లను తగ్గించి ఎన్రోల్మెంట్ పెంచాలన్నారు.
విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రావీణ్యంతో తీర్చిదిద్దేందాలని,భవిష్యత్తులో యంత్రాల ప్రాధాన్యం పెరుగుతుందని, విద్యార్థుల్లో మానసిక స్థైర్యం అవసరమన్నారు. అపజయాల సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలని,సోషల్ బిహేవియర్, కుటుంబ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శారీరక శిక్షలు కాకుండా మార్గదర్శకంతో విద్యార్థులను సరిదిద్దాలని, టీచర్ తలిస్తే రాయిని కూడా వజ్రంగా మార్చగలరని పేర్కొన్నారు.
డిజిటల్ బోర్డులు, డిజిటల్ పాఠ్యపుస్తకాలతో ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కావడం జరిగిందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 50% నుంచి 94% వరకు పెరిగినట్లు వెల్లడించారు. శతశాతం కార్యక్రమాన్ని 8, 9 తరగతులకు విస్తరించాలని, ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసం ప్రత్యేక ఫారమ్, నిధుల సమీకరణ బాధ్యత తనదేనని,ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ట్రిపుల్ ఐటీ సాధన కోసం ఏర్పాటు చేసిన శిక్షణకు ఉదయం 5 గంటల నుంచే బోధన, ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనం అన్నారు. గవర్నమెంట్ బాలికల జూనియర్ కాలేజీలో 992 మార్కులు ప్రభుత్వ లెక్చరర్ల కృషి ఫలితగానే సాధ్యం కావడం జరిగిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ప్రతి ఒక్కరు నిబద్ధత తో తమ విధులను నిర్వహించి మంచి విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, జగపతి రావు, ఫరూక్ హుస్సేన్, వెంకట నర్సయ్య, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.






