22 April, 2026 | 2:29 AM

ఐఐటీ -జెఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో అల్ఫోర్స్‌కు ర్యాంకుల పంట

22-04-2026 12:49 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 21(విజయక్రాంతి):సోమవారం ప్రకటించబడిన ఐఐటి-జెఈఈ (మెయిన్) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఎం.శ్రీ పార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, | సి.హెచ్. పూర్ణచంద్ 138, ఎస్. వర్జినిరెడ్డి 211, ఎన్. రత్నప్రకాశ్ 239, పి. అక్షయ 250, ఎ. కీర్తన 274, యు. సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్. వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశరని,1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు ఐఐటి (అడ్వాన్స్) పరీక్షకు అర్హత సాధించడం విశేషమని తెలిపారు.

రాబోయే ఐఐటి (అడ్వాన్స్) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇవ్వబడునని,పటిష్ట ప్రణాళికతో విద్యా భోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగామని నరేందర్ రెడ్డి అన్నారు.రాబోయే ఐఐటి (అడ్వాన్స్) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి లలో సీట్లు సాధిస్తారని, ప్రతి సంవత్సరము ఐఐటి, నీట్ మరియు ఇఎపిసెట్ పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ఐఐటి జెఈఈ (మెయిన్) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ,ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.