‘ముందుమాట’వివాదం అధికారులపై వేటు
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సమగ్రశిక్షకు బదిలీ
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): తెలుగు పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, అప్పటి అధికారుల పేర్లను కొనసాగిస్తూ విద్యార్థులకు పంపిణీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులైన అధికా రులపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్ ఎస్ శ్రీనివాసచారిని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా ఉన్న ఎం రాధారెడ్డిని అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్‌పీడీ)గా సమగ్రశిక్షకు బదిలీ చేశారు. సమగ్రశిక్ష ఏఎస్‌పీడీగా ఉన్న అడిషనల్ డైరెక్టర్ రమేశ్‌ను ఎస్సీఈఆర్టీకు రాధారెడ్డి స్థానానికి పంపించారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సీహెచ్ రమణకుమార్‌ను పాఠ్యపుస్తక ముద్రణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ పేజీని చివరలో అతికింపు...
ముందుమాట పేజీలో స్వల్ప మా ర్పులు చేసి అవే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలిస్తూ ముందుమాట పేజీని చించేసి దాన్ని అదే పుస్తకం చివరివైపు అట్టకు వందేమాతరం కనిపించేలా అతికించి పం పిణీ చేయాలని ఆదేశించారు. ఎలా అతికించాలో టీచర్లకు వివరిస్తూ వి డుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






