23 June, 2026 | 12:03 AM

ముప్పూట భోజనమెలా?

15-06-2024 12:31 AM
  1. రూ.38తో గురుకుల విద్యార్థులకు అందని పౌష్ఠికాహారం 

అరకొరగా మెస్ బిల్లులను విడుదల చేస్తున్న సర్కార్ 

జైల్లో ఖైదీలకు రోజుకు రూ.120 నుంచి 140 వరకు ఖర్చు 

విద్యార్థులకు మాత్రం అందులో పావు వంతే 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలను వందలాదిగా ఏర్పాటు చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునేందుకు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌తో డిగ్రీ వరకు కాలేజీలను ప్రభుత్వం నిర్మించింది. అయితే  విద్యార్థులకు సంబంధించి డైట్ విషయంలో మాత్రం సరిపడా నిధులు ఇవ్వడం లేదు.

జైలులోని ఒక ఖైదీకి రోజుకు రూ.120 నుంచి రూ.140 వరకు ఖర్చు చేస్తున్న ఇదే ప్రభుత్వం విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.38 మాత్రమే ఖర్చు చేస్తోంది. దీంతో ఖైదీల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రోజుకు ప్రభుత్వం ఇచ్చే రూ.38 నుంచే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి ఇచ్చే భోజనానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసే చాలీచాలని డబ్బులతో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదని, దీంతో గురుకులాలకు సరుకుల పంపిణీ చేసే కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 

రాష్ట్రంలో బాలబాలికలకు కలిపి మొత్తం 781 గురుకులాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ గురుకులాలు 268, బీసీ గురుకులాలు 232, ఎస్టీ 77, మైనార్టీ 204 వరకు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థులు ఉంటారు.  ఒక్కో విద్యార్థికి చదువుకునే తరగతిని బట్టి ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఈ మొత్తం ఖర్చులోనే  మెస్ బిల్లుతో పాటు విద్యార్థులకు మూడు జతల బట్టలు, బూట్లు, సాక్సులు, ట్రంక్‌పెట్టే, దుప్పటి, పుస్తకాలు, నోట్‌బుక్స్, ప్లేట్ , గ్లాస్, బెడ్‌షీట్స్, సబ్బులు, కాస్మోటిక్ చార్జీలన్నీ ఉంటాయి.

కాగా,  మెస్‌కు సంబంధించి ప్రతి నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ అందివ్వాలి. ఉదయం రోజుకో రకం టిఫిన్, పాలు, బూస్ట్‌ను విద్యార్థులకు అందించాలి. సాయంత్రం స్నాక్స్‌లో ఒక పండు, పాలను కూడా అందించాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు, నెయ్యి, ఒక గుడ్డు, రాత్రి భోజనంలో ఒక కర్రీ, రసం, బట్టర్ మిల్క్, సీజన్ పండ్లను అందివ్వాలి. ఇవి రోజుకు ఒకే రకంగా ఉండకుండా ప్రతి రోజు వివిధ రకాల మెనూను అందించాలని ప్రభుత్వం ఒక చార్ట్‌ను అందించింది. నెలలో రెండు, నాలుగో ఆదివారం చికెన్, మొదటి, మూడో ఆదివారం మటన్ పెట్టాల్సి ఉంటుంది. 

తరగతుల వారీగా 

ప్రతి నెల ప్రభుత్వం 

విడుదల చేసే చార్జీలు..

తరగతి చార్జీలు 

5 నుంచి 7  వరకు రూ.950

8 నుంచి 10 వరకు రూ.1,100

ఇంటర్ నుంచి డిగ్రీ రూ.1,500 

మెనూ ఇదే..

రోజు బ్రేక్‌పాస్ట్ మధ్యాహ్నం స్నాక్స్ రాత్రి 

సోమ నూడిల్స్, బూస్ట్, పాలు రైస్ , ఆలు కర్రీ, పప్పు,  సేమియా రైస్, ఆలు కర్రీ, 

సాంబార్, పెరుగు, నెయ్యి, గుడ్డు, రసం, బటర్ మిల్క్, సీజన్ ఫ్రూట్

మంగళ పులిహోర, చట్నీ, రసం రైసు, బీట్‌రూట్ కర్రీ, టమాటపప్పు, ఉడికించిన శెనగలు  రైస్, క్యాబేజీ కర్రీ, సాంబార్, 

పాలు, బూస్ట్ రసం, పెరుగు, నెయ్యి, పచ్చడి, గుడ్డు బటర్ మిల్క్, సీజనల్ ఫ్రూట్ 

బుధ కిచిడీ,పెరుగు రైతా, రైస్, బెండకాయ కర్రీ, పాలకూర పప్పు, క్యారెట్ హల్వా భగారా రైస్, 

టమాటో కర్రీ, బటర్ పాటు,  బూస్ట్ సాంబార్, పెరుగు, నెయ్యి, పచ్చడి, గుడ్డు మిల్క్, 

గురు పూరీ, ఆలు కర్రీ రైస్, ఆలు కర్రీ, పాలకూర పప్పు, మిల్లెట్ బిస్కెట్ రైస్, బిన్నీస్ కర్రీ, సాంబార్, బటర్                 

పాలు, బూస్ట్ టమాట రసం, పెరుగు, నెయ్యి, పచ్చడి, గుడ్డు          మిల్క్, సీజన్ ఫ్రూట్ 

శుక్ర ఇడ్లీ, చట్నీ, సాంబార్ రైస్, దోసకాయ కర్రీ, సాంబార్, బటర్ ఉడకపెట్టిన పెసర్లు రైస్, బీన్స్ కర్రీ, టమాట రసం, 

పాలు, బూస్ట్ మిల్క్, గుడ్డు, నెయ్యి, పచ్చడి,  బటర్ మిల్క్, సీజన్ ఫ్రూట్ 

శని రైస్ పొంగల్, సేమియా వెజ్‌ఫ్రైడ్ రైస్, సాంబార్, పెరుగు,                ఉల్లి పకోడీ      రైస్, క్యాలీపవర్, 

రసం బటర్    నెయ్యి, పచ్చడి మిల్క్, సీజన్ ఫ్రూట్ 

ఆది చపాతీ లేదా బోండా భగారా రైస్, ఆలు కుర్మా పల్లీ చిక్కీ రైస్, చామగడ్డ కర్రీ, రసం, బటర్

పాలు, బూస్ట్  సాంబార్, పెరుగు, పచ్చడి                       మిల్క్ , సీజన్ ఫ్రూట్