23 April, 2026 | 11:23 AM

బకాయిలకు గత ప్రభుత్వమే కారణం

19-12-2024 02:11 AM
  • ‘విదేశీ విద్య’కు వారి హయాంలోనే రూ.244 కోట్ల అప్పు
  • మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ డ్రామాలు
  • ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సీతక్క

  • హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి సీతక్క మండిప డ్డారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై బీఆర్‌ఎస్ సభ్యులు వివేకానంద, రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, బలాలా బుధవారం అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చా రు. ఈ పథకంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 244 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని.. తాము అధికారంలోకి వచ్చాకే రూ.140.74 కోట్ల బకాయిలు చెల్లించామని స్పష్టం చేశా రు.

  • మార్చి వరకు సమయం ఉన్నా డిసెంబర్ నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న రూ. 104 కోట్లు క్లియర్ చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమ లు చేస్తామన్నారు. కొత్తగా అంబేద్కర్ ఓవర్సీస్ కింద 3,488 దరఖాస్తులు రాగా.. 1,310 మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి లావణ్య బీఆర్‌ఎస్ హయాంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తు చేశారు. మీరు పెట్టిన రూ.4,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి చెల్లింపులకు చర్యలు తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.

  • మహిళలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగానే ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతుందని మంత్రి విమ ర్శించారు. పేదింటి మహిళలు ఎక్కేందుకు ఉచిత బస్సులు అవసరం లేదా? ఇందుకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలన్నారు. బైక్ డ్రాపింగ్ సర్వీసులు, ఓలా, ఉబర్ వంటి సేవలను మీరే ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందని మండిపడ్డారు.