23 April, 2026 | 9:50 AM

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నచ్చిన చోట పోటీ చేయలేదా?

19-12-2024 02:07 AM
  • దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేయండి
  • గంగుల మూడుసార్లు పార్టీ మారారు..
  • గురుకులాలకు అద్దెలు కట్టని వారు.. వాటిలో సంస్కరణలపై మాట్లాడడం విడ్డూరం: మంత్రి పొన్నం

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత హరీశ్‌రావు సైతం గతంలో తమకు నచ్చిన ని యోజకవర్గాల్లో పోటీ చేశారు. అంతమాత్రా న వారు ఆయా జిల్లాల నుంచి పారిపోయినట్లు మీరు భావిస్తున్నారా ?’ అంటూ మం త్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజాస్వామ్యం లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ నేతలకు ద మ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. గంగుల కమలాకర్ మూడుసార్లు, మూడు పార్టీ మారారని, అ లాంటి వారు తనపై వ్యాఖ్యలు చేయడం వి డ్డూరమన్నారు. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఆరోపణలపైనా పొన్నం స్పందించారు. ‘నాడు నేను స్ప్రే చేసింది.. పెప్పర్ స్ప్రేనా? కాదా?’ అనే అంశం పార్లమెంట్ ప్రొసీడింగ్‌లో ఉంటుంది’ అని తేల్చిచెప్పారు. తనను ఫస్ట్ ఎమ్మెల్యే అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

గంగుల వ్యాఖ్యలను రి కార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కో రారు. గత ప్రభుత్వం 2014 నుంచి అధికా రం కోల్పోయే వరకు ఎన్నో గురుకుల భవనాలకు అద్దె చెల్లించలేదని మండిపడ్డారు. అలాంటి  పార్టీ నేతలు కాంగ్రెస్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒక గుడ్డు ధర రూ. 5 ఉన్నప్పుడు.. కేవలం రూ.3కు టెండర్ ఇచ్చి నవారు గురుకులాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తానూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుకున్నానని, విద్యా ర్థుల సమస్యలు తనకు తెలుసునన్నారు. దర్జాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివిన ఎమ్మెల్యే గంగులకు పిల్లల సమస్యలు ఎలా తెలుస్తాయని చురక అంటించారు.