ఎరువులు, పెట్రోలు, వంటగ్యాస్, ధరలను వెంటనే తగ్గించాలి
న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి
కూసుమంచి, మే 20 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ పెంపు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ప్రజలపై కోట్లాది రూపాయలు భారం పడి దివాలా తీసే పరిస్థితి వస్తుందన్నారు.
కేంద్రం గత 12 సంవత్సరాలలో కార్పొరేట్ల అనుకూల విధానాలు అవలంబిస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కూసుమంచి సబ్ డివిజన్ కార్యదర్శి ఐ వెంకన్న. కే సురేష్.చెరుకుపల్లి వీరయ్య. బుర్ర సైదులు బత్తల ఉప్పలయ్య. నిమ్మల వెంకన్న . దాట్ల వీరస్వామి పోకల వెంకన్న.ఆర్ సంజీవరావు. పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు కే కల్పన. తదితరులు పాల్గొన్నారు






