calender_icon.png 3 December, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

03-12-2025 10:02:38 PM

-అర్హులైన జర్నలిస్టు లందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి..

-రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి..

 -టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు

హుజుర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం హైదరాబాదులోని తెలంగాణ సమాచార శాఖ భవన ఎదుట ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణలోని జర్నలిస్టులందరూ ఎంతో కీలకపాత్ర పోషించాలని గుర్తు చేశారు. గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశించామని అన్నారు.కానీ గత రెండేళ్లుగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జర్నలిస్టులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని సూచించిన నేటి వరకు అమలు కాలేదన్నారు. ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులు అమలు కావడం లేదన్నారు. అధికంగా వెనుకబడిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు..రాష్ట్ర కార్మిక శాఖ ద్వారా  కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణలోని 33 జిల్లాలలో అన్ని మండలాల్లో  పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల కుటుంబాలకు 50శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పిల్లలమర్రి శ్రీనివాసరావు, బసవోజు శ్రీనివాస చారి,దేవరం రామిరెడ్డి,ఆర్.పి గౌడు,శేషం రాజు,జానీ పాషా, రామకృష్ణ,నాగుల్ మీరా, అంజయ్య,వెంకటరెడ్డి,ఇందిరాల రామకృష్ణ, పాల్గొన్నారు.