calender_icon.png 3 December, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదృశ్యమైన యువకుడు బావిలో శవమై తేలిన ఘటన

03-12-2025 10:00:57 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బుధవారం సిర్గాపూర్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని వాసర్ కు చెందిన దత్తురావు(36) అక్టోబర్ 23న కంగ్టి మండలం నాగన్ పల్లి గ్రామానికి మేన మామ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. అయితే తిరిగి రాలేదు. ఎంత వెతికిన ఆచూకీ తెలియలేదు. దాంతో ఆయన తల్లి పద్మావతి తన కుమారుడు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిర్గాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే పొట్పల్లి గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి బావిలో బుధవారం నాడు మేకల కాపర్లు శవాన్ని చూసి, స్థానికుల సిర్గాపూర్  పోలీసులకు సమాచారం తెలిపారు. దాంతో సిర్గాపూర్ ఎస్సై మహేష్ శవాన్ని వెలికి తీయించి శవాన్ని పంచనామా జరిపి అంత్యక్రియలు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై మహేష్ తెలిపారు.