calender_icon.png 12 January, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

04-01-2026 12:11:32 AM

సికింద్రాబాద్, జనవరి 3 (విజయ్ క్రాంతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణీకుల భద్రత దృష్ట్యా శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పిఎఫ్ పోలీసు లు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానా స్పదంగా కనిపించిన వ్యక్తులు లగేజీలు తనిఖీలు చేశారు.

అలాగే ప్రయాణీకులకు పలు భద్రతా పరమైన సూచనలు చేశారు. రైలులో ప్రయాణించే సమయంలో కానీ,రైల్వే స్టేషన్ లో కానీ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే రైల్వే టోల్ ఫ్రీ నంబరు 139కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ బీఎస్ సారస్వత్,సబ్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట్ రెడ్డి, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.