4 April, 2026 | 1:49 PM

Breaking News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •   పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు   •  

బీజేపీతోనే దేశ ప్రగతి

06-05-2024 02:18 AM

ఇబ్రహీంపట్నం, మే 5 (విజయక్రాంతి): బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్య మని, ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం ఆయన పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రత ప్రధాని మోదీతోనే సాధ్య మన్నారు. మోదీ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి ఆపత్కాలంలో భరోసానిచ్చాయన్నారు. కరోనా  సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. అనేక విప్లవా త్మక నిర్ణయాలు తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో  ముందుకు తీసుకెళ్లారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ నాయకులు ముత్యాల భాస్కర్, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, సత్యనారాయణ, అంజయ్య, నారాయణరెడ్డి, బోజిరెడ్డి, రాంరెడ్డి, రమణారెడ్డి, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.