4 April, 2026 | 3:22 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

ఢిల్లీ పోలీసులది అనైతిక చర్య

06-05-2024 02:20 AM

పీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ రామచంద్రారెడ్డి 

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని పీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ రామచంద్రారెడ్డి విమర్శించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకుని.. విచారణకు సహకరిస్తామని చెప్పినా.. మహిళా పోలీసు లేకుండానే కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన ఓ మహిళ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకోవడమేంటని నిలదీశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే క్రైమ్‌ను పక్కన పెట్టి తెలంగాణపై ఎందుకు అంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్‌ను కూడా పట్టించుకోకుండా మళ్లీ ఒక విద్యార్థిని అరెస్టు చేయాలని చూశారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని, ఏది చెప్పినా చెల్లుతుందనుకోవడం సరికాదన్నారు. ఫేక్ వీడియోకు సంబంధించిన కేసుపై చట్టబద్ధంగా విచారణ చేయాలని పార్టీ నేత వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు బెదిరింపులు మానుకోవాలని, తాము తలుచుకుంటే ఢిల్లీ పోలీసులను హైదరాబాద్‌కు రాకుండా చేస్తామని హెచ్చరించారు.