28-01-2026 12:00:00 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ, జనవరి 27 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి సీఎం రే వంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అండగా ఉం టుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మంజూరునగర్ లో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని ప్ర తి వర్గానికి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమా నికి ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చె ప్పారు.
దివ్యాంగులు స్వావలంబనతో గౌరవంగా జీవించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడమే ప్రభు త్వ లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేం దుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హత కలిగిన ఎవరికీ అన్యాయం జరగకుం డా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
యాదవకాలనీలో కొత్త విద్యుత్ లైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే.భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యాదవకాలనీ 5వ వార్డు లో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్విచ్చాన్ చేసి ప్రారంభించారు.