28-01-2026 12:00:00 AM
ధర్మపురి, జనవరి27(విజయక్రాంతి): ఎండపల్లి గ్రామ సర్పంచ్ మారం సునీత జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. గడ్డం స్వామీ రెడ్డి జన్మదినం సందర్బంగా ఫార్చూన్ హాస్పిటల్ కరీంనగర్ గార్ల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులు మె రుగుపర్చేందుకు వైద్య శిభిరాలు ఎంతో ఉపయోగపడుతాయనీ సర్పంచ్ పేర్కొన్నారు.
పేద ప్రజలకు తమ వంతు సహాయంగా వైద్య శిబిరం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్బంగా సర్పంచ్ తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణ పట్ల ఎండపల్లి గ్రామస్థులతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సర్పంచ్ మారం సునీత జలందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.